తెల్ల జుట్టును నల్ల జుట్టుగా మార్చుకోవాలంటే...

శనివారం, 12 జనవరి 2019 (22:31 IST)
ప్రస్తుతకాలంలో చాలామంది తెల్లజుట్టుతో బాధ పడుతున్నారు. చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులవారిని ఈ సమస్య బాధిస్తుంది. దీనికి వంశపారంపర్యం ఒక కారణమైతే, థైరాయిడ్, అధిక వత్తిడి, ఆందోళన మరొక కారణం. ముఖ్యంగా చిన్నపిల్లలలో పోషకాహార లోపం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరి.
 
1. రకరకాల షాంపూలను కాకుండా ఎప్పుడూ ఒకే రకమైన షాంపూలను మాత్రమే వాడాలి. 
 
2. పాలు, గుడ్లు, సోయాబీన్స్, మెులకెత్తిన విత్తనాలు, డ్రై ప్రూట్స్ వంటివి ఎక్కువుగా తీసుకొనటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
3. గుడ్డు తెల్లసొనలో కొద్దిగా కరివేపాకు లేదా మెంతి ఆకువేసి మెత్తగా ఫేస్టు చేసి తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
 
4. ఐదు టీస్పూన్ల ఉసిరిపొడి, 2 టీస్పూన్ల గోరింటాకు పొడి, 2 టీస్పూన్ల మిరియాల పొడి, 2 టీస్పూన్ల టీ పొడి, 2 టీ స్పూన్ల నువ్వులపొడి తీసుకొని దానికి సరిపడా నీళ్లు  కలిపి మెత్తగా చేయాలి. దీనిని రాత్రి పూట తయారుచేసి ఉదయానే 5 నిమిషాలపాటు సన్నటి సెగపై వేడి చేయాలి. తర్వాత దానిని తలకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
 
5. మందార ఆకుల్ని మెత్తగా పేస్టులా చేసి దానికి కొబ్బరినూనెను కలిపి తలకు రాయాలి. ఒక గంట తర్వాత శుభ్రంగా కడిగేసి తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
6. ఆముదంలో హెన్నపౌడర్ వేసి మరిగించి చల్లారిన తర్వాత తలకు పూసుకోవాలి. రెండుగంటల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే నల్లటిజుట్టు మీ సొంతం అవుతుంది. 
 
7. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా కాఫీ పొడిని వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత జుట్టుకుదుళ్లకు బాగా మర్ధన చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు