మిరపకాయలు మూత్రంలో మంటను తగ్గిస్తాయి.. ఎలాగంటే?

బుధవారం, 27 జనవరి 2021 (22:56 IST)
పచ్చిమిరప కాయల్లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు పుష్కలంగా వుంటాయి. మిర్చిలో విటమిన్‌ 'ఎ', 'సి'లతో పాటూ రక్తహీనత రాకుండా చేసే ఇనుమూ, గుండె జబ్బులు రాకుండా చేసే పొటాషియం, క్యాన్సర్‌ కారకాలతో పోరాడే బీటా కెరొటిన్‌ వంటి పోషకాలుంటాయి. పచ్చి మిరపలో ఉండే పోషకాలు అజీర్తి సమస్య ఏర్పడకుండా కాపాడతాయి.
 
క్యాలరీలను కరిగించి జీవ క్రియలు వేగంగా జరిగేట్టు చూస్తాయి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తగిన మోతాదులో పచ్చి మిరపకాయలు ఆహారంలో తీసుకుంటే ఉపశమనం పొందుతారు. వీటిల్లో పుష్కలంగా ఉండే 'ఎ' విటమిన్‌మెరుగైన కంటిచూపుకీ, ఎముకలూ, పళ్ల బలానికి సాయపడుతుంది.
 
మధుమేహ సమస్య వున్నవారు మిరియం తైలాన్ని రెండు మూడు చుక్కలు లస్సీతో కలిపి తీసుకుంటే మూత్రంలో మంట, మూత్రంలో సుద్ద పోవటం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఎగ్జిమా, దురద, కీళ్లనొప్పి, కుక్కకాటు, కందిరీగ కాటు వంటి సమస్యల్లో మిరప పండ్ల తైలాన్ని పైపూతగా వాడుకుంటే మంచి ఫలితం వుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు