మనకు మార్కెట్లో దొరికే డ్రై ప్రూట్స్‌లో పిస్తాపప్పుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకములైన ఔషద గుణాలు ఉన్నాయి. ఇందులో అనేక రకములైన పోషకాలతో పాటు విటమిన్ బి6, ఫైబర్, పాస్పరస్, కాపర్, పొటాషియం ఉన్నాయి. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ వృద్ధికి దోహదం చేస్తుంది. పిస్తా పప్పులోని ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
1. ఇది శరీరంలోని ఊపిరితిత్తులకు మరియు ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది.
4. రోజూ పిస్తాను తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. అంతేకాకుండా కంటి సమస్యలతో బాధపడేవారికి పిస్తా మంచి ఫలితాన్నిస్తుంది. ఇందులోని కెరోటినాయిడ్లు కంటిలోని కణాలను పునరుద్ధరించి కంటిచూపు స్పష్టంగా ఉండేలా చేస్తాయి.
5. ఇందులో ఉండే విటమిన్ ఎ మరియు విటమిన్ బి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇది శరీరాన్ని అనేక శారీరక రుగ్మతల నుండి దూరం చేస్తుంది. శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. తద్వారా క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. శరీరంలోన ఏర్పడే ఫ్రీరాడికల్స్ నుండి రక్షిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది.