ప్రతి స్త్రీ సన్నగా నాజూగ్గా ఉండాలని కోరుకుంటుంది. మంచి శరీరాకృతి కోసం నానా తంటాలు పడుతుంటారు. ఎన్నో చేస్తూ ఉంటారు, దీనికోసం రాత్రి పూట భోజనం మానేయడం, మధ్యాహ్నం ఆకలిని చంపుకోవడం, గంటలు గంటలు అదే పనిగా వ్యాయామాలు చేయడం ఇలా నానా హైరానా పడతారే తప్ప చేయాల్సిన పనిని చేయరు. మంచి ఆరోగ్యం శరీరాకృతి పొందాలంటే ఈ చిట్కాలు పాటించాలి.
* అధిక కొవ్వు, క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోకూడదు.
* పాల ఉత్పత్తులు, చాక్లెట్స్, వంటి ఆహారం పదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరం.
* పండ్లు, కూరగాయలు తీసుకుంటే నాజూకు శరీరాన్ని పొందవచ్చు.
* ఎక్కువ శాతం మంచి నీరు తీసుకోవడం ఎంతో అవసరం, రోజుకి కనీసం 3 నుండి 5 లీటర్ల తాగడం మంచిది.