బఠాణీలు ఏదో కాలక్షేపం కోసం తింటుంటారని అనుకుంటారు చాలామంది. కానీ అవి ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు. తాజా బఠాణీలు ఫోలిక్ ఆమ్లానికి మంచి నిల్వలుగా వుంటాయి. గర్భం దాల్చడానికి మహిళల కణాల్లో డీఎన్ఎ కోసం ఫోలేట్లు అవసరం. ఇవి బఠాణీల్లో అధికంగా వుంటాయి. అందువల్ల ఆ సమయంలో మహిళలకు వీటిని ఇస్తుంటారు. ఇంకా మరిన్ని ప్రయోజనాలను చూద్దాం.
* బఠాణీల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా వుంటుంది. ప్రోటీన్లు, పీచు పదార్థం ఎక్కువగా వుండటం వల్ల నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర చేరకుండా వుంటుంది. కనుకనే ఈ బఠాణీలను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చూచిస్తుంటారు.