టూత్ పేస్టుతో పళ్లు తోముకోవడమే కాదు.....

శుక్రవారం, 21 జులై 2017 (12:52 IST)
టూత్ పేస్ట్‌తో కేవలం పళ్లు తోముకోవడం మాత్రమేకాకుండా ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొంచెం కోకో కోలా పానీయంలో కాస్త టూత్ పేస్టు కలిపి దానితో సింక్‌, వాష్ బేసిన్‌లను శుభ్రపరిస్తే తళతళా మెరుస్తాయి. మొబైల్ స్క్రీన్‌లపై లేదా స్క్రీన్ గార్డ్‌లపై గీతలు పడినప్పుడు టిష్యూ పేపర్‌పై కాస్త టూత్ పేస్టు వేసుకుని దానితో రుద్దితే గీతలు మటుమాయమవుతాయి. 
 
అంతేకాకుండా కూలింగ్ గ్లాసెస్‌పై గీతలు పడినప్పుడు కూడా ఈ చిట్కాను పాటిస్తే ఫలితం ఉంటుంది. ఎక్కువగా ఇస్త్రీ చేయడం వలన ఐరన్ బాక్స్‌ క్రింది భాగం నల్లగా మారినప్పుడు టూత్ పేస్టుతో దాన్ని రుద్దితే కొత్తది లాగా మెరుస్తుంది. ఎన్వలప్ కవర్లు లాంటివి అంటించేందుకు సమయానికి గమ్ లేకపోతే కాస్త పేస్టు వాడితే చక్కగా అతుక్కుంటుంది. మాములుగా అగ్గిపుల్లలు నీటిలో తడిస్తే తర్వాత ఎంత గీసినా వెలగవు, అదే అగ్గిపుల్ల తలభాగానికి పేస్టు పూసి ఉంచితే అవి నీళ్లలో తడిసినప్పటికీ ఏదైనా గుడ్డతో తుడిచేసి గీస్తే చక్కగా వెలుగుతాయి.

వెబ్దునియా పై చదవండి