ప్రతి ఆస్కార్ వేడుకలోనూ గడచిన 12 నెలల్లో స్వర్గస్తులైన సినీ ప్రముఖులకు నివాళులు అర్పించడం అనవాయితీ. అందులో భాగంగా భారతీయ నటుడు ఓంపురికి నివాళులర్పించారు. ‘సిటీ ఆఫ్ జాయ్’, ‘వోల్ఫ్’, ‘ద ఘోస్ట్ అండ్ ద డార్క్‌నెస్’, ‘సచ్ ఎ లాంగ్ జర్నీ’, ‘ఈస్ట్ ఈజ్ ఈస్ట్’లతో పాటు మరికొన్ని ఇంగ్లీష్ చిత్రాల్లో ఓంపురి నటించారు. ఆయన నటించిన చివరి ఇంగ్లీష్ చిత్రం ‘వైశ్రాయస్ హౌస్’ ఈ నెల 12న బెర్లిన్‌లో విడుదలైంది.
మార్చి 3న యూకేలో విడుదల కానుంది.
‘‘25 ఏళ్ల నుంచి వరుసగా హాలీవుడ్, బ్రిటీష్ సినిమాల్లో నటిస్తున్న ఏకైక నటుడు ఓంపురి. ఈరోజు ఆస్కార్స్ ఆయనకు నివాళులు అర్పించింది. ఆస్కార్స్ నివాళులు అందుకున్న తొలి భారతీయ నటుడు ఓంపురీనే. థ్యాంక్యూ అకాడెమీ అవార్డ్స్. థ్యాంక్యూ ఎవ్రీవన్. వుయ్ మిస్ ఓం’’ అని ఓంపురి ఫ్యామిలీ ఓ ప్రకటనలో పేర్కొంది.