ఎలాంటివారు అభ్యంగన స్నానం చేయకూడదో తెలుసా..?

శనివారం, 29 డిశెంబరు 2018 (12:17 IST)
ప్రతిరోజూ శరీరానికి నూనెతో మర్దన గావించి, తరువాత స్నానం చేస్తే చాలామంచిది. దీనివలన సర్వాంగాలకు పుష్టి కలుగుతుంది. ఆవనూనె, గంధపుచెక్కల నుండి తీసిన నూనె, సుగంధ ద్రవ్యముల నుండి తీసిన నూనెలు, పుష్పముల నుండి లభించు నూనెలను అభ్యంగన స్నానానికి ఉపయోగించవచ్చును.
 
అభ్యంగనము వలన వాత, కఫ దోషాలు హరించును. శారీరక బడలికను పోగొట్టి.. బలాన్ని కలిగిస్తుంది. దేహకాంతి, మంచి కంటి చూపు, సుఖ నిద్రను కలిగిస్తుంది. ఆయుష్షును వృద్ధి చేస్తుంది. ప్రతిరోజూ చెవులలో కొద్దిగా తైలపు చుక్కలు వేసుకోవడం వలన చెవులలోని మాలిన్యములు తొలగిపోతాయి. శద్ధగ్రహణం బాగుంటుంది. చెవిపోటు, ఇతర సమస్యలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. 
 
ప్రతిరోజూ పాదములకు తైలముతో మర్దన చేయుట వలన పాదములలో బలం వృద్ధి చెందుతుంది. మొద్దుబారిన పాదాలు స్పర్శా జ్ఞానములను సంతరించుకుంటాయి. పాదములు మీద పగుళ్ళను పోగొట్టుతాయి. దీనివలన నేత్రములకు కూడా చలువచేస్తుంది. కళ్ళు ప్రకాశవంతమవుతాయి. సుఖ నిద్ర కలుగుతుంది. 
 
శిరస్సు మీద నూనె మర్దనా చేయడం వలన మెదడు శక్తివంతమవుతుంది. కళ్ళులు, చెవులు, దంతములకు ఎటువంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. శరీరాభ్యంగము వలన తైలం రోమకూపములలో నుండి లోనికి ప్రవేశించి నరములు, రక్తనాళములలో ఎంతో చురుకుదనాన్ని కలిగిస్తుంది. ధాతువులను వృద్ధి చేస్తుంది. వివిధ రకాల జ్వరములతో బాధపడేవారు, అజీర్ణవ్యాధులతో బాధపడేవారు, విరేచనములగుటకు ఔషదం తీసుకున్నవారు తైలంతో అభ్యంగము చేయకూడదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు