గుడ్డు కంటే వేరుశెనగే బెస్ట్.. మాంసకృత్తులు పుష్కలం

శనివారం, 10 అక్టోబరు 2015 (14:30 IST)
శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రొటీన్‌, ఫాస్ఫరస్‌, థైమీన్‌, నియాసిన్‌ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఇందుకోసం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ధరలో వుండే కోడిగుడ్డును ఆరగిస్తుంటారు. అయితే, గుడ్డుకంటే రెండున్నర రెట్లు అధిక శక్తినిచ్చేది వేరుశెనగ అని చెపుతున్నారు. ఇందులో గుడ్డులో కంటే రెండున్నర రెట్లు ఎక్కువగాగానే మాంసకృత్తులు ఉంటాయట. ఒక కిలో మాంసంలో లభించే మాంసకృత్తులు.. అదే మోతాదు మాంసకృత్తులు వేరుశెనగలో లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. 
 
అలాగే, వేరుశెనగలో ప్రొటీన్, ఫాస్పరస్, థైమీన్, నియాసిన్‌తో పాటు శక్తినిచ్చే మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయ. అలాగే, ఏ, బి, బి, సి, ఇతో కలిపి వెుత్తం 13 రకాల విటమిన్లూ ఇంకా ఐరన్‌, కాల్షియం, జింక్‌, బోరాన్‌ వంటి 26 రకాల కీలక ఖనిజాలూ ఇందులో లభిస్తాయట. వేరుశెనగ విత్తనాల్లో గుండెకు మేలు చేసే వోనో అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వుల శాతమే ఎక్కువ. 
 
ఇందులోని ప్రోటీన్‌శాతం మాంసం, గుడ్లలోకన్నా ఎక్కువ. పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి. వేయించిన తాజా గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట. హెపటైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ వంటివి రాకుండా ఉంటాయని చెపుతున్నారు. 
 
అలాగే, నెలసరి సమయాల్లో అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలు కొంచెం పల్లీలు నానబెట్టి బెల్లంతో కలిపితింటే ఐరన్‌తోపాటు అన్ని రకాల పోషకాలూ అందుతాయట. తాజా పచ్చి పల్లీలకు చిటికెడు ఉప్పురాసి తింటే చిగుళ్లు గట్టిపడి దంతాల్ని సంరక్షిస్తాయి. అయితే, కొంతమందికి వేరుశెనగ పల్లీలు ఆరగించడం వల్ల అలెర్జీ రావొచ్చు. అలాంటి వీటికి దూరంగా ఉండటం ఎంతో మంచిది.

వెబ్దునియా పై చదవండి