చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఉబ్బసం వ్యాధులకు కాచిన నీరు ఎక్కువగా త్రాగడం, ఆవిరిపీల్చడం వలన స్వస్థత చేకూరుతుంది. బెణుకులు, వాపులకు, వేడినీటి కాపడం పెట్టడం వలన ఈ సమస్యలు తగ్గుతాయి. ముక్కులు బిగిసినప్పుడు ఉప్పునీటిని ముక్కుతో పీల్చాలి. గొంతునొప్పికి, వేడినీటిలో ఉప్పు కలిపి గొంతులో పోసుకుని పుక్కిలించడం వలన బాధ తగ్గుతుంది.
మలబద్ధకంతో బాధపడేవారు పడుకునే ముందు, ఉదయం లేవగానే నీరు త్రాగిన బాధ తగ్గుతుంది. దురదలు, మంటలు ఏర్పడినప్పుడు చన్నీటి కాపడం పెట్టనా ఉపశమనం కలుగుతుంది. కాచిన నీరు త్రాగుతూ, శరీర అవయవాలు పరిశుభ్రంగా కడుక్కోవడం ద్వారా అంటువ్యాధుల నుండి రక్షణ పొందవచ్చును. జ్వర తీవ్రత ఎక్కువగానున్న ఎడల, చల్లని నీటిలో శుభ్రమైన గుడ్డను తడిపి నుదుటిమీద ఉంచిన జ్వరం తగ్గుతుంది.
నీరు సరిపడినంత ప్రతిదినమూ త్రాగుచున్నవారికి సామాన్యమైన మూత్రాశయ వ్యాధినుండి, మూత్ర విసర్జనలో దురదలు, మంటల నుండి ఉపశమనం పొందగలరు. బార్లీ నీరు త్రాగడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది.