థాయ్‌లాండ్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళను నరికి ఆ ముక్కలను నల్లటి కవర్లలో ప్యాక్ చేసి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచన ఘటన కలకలం రేపుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... థాయిలాండ్ పోలీసులు ఓ డ్రగ్స్ ముఠాను అరెస్టు చేశారు. అయితే వారి కంటపడిన ఓ దృశ్యం ఒళ్లు గగ్గుర్పొడిచేలా చేసింది. ఒక మహిళను ముక్కలు ముక్కలుగా నరికి నల్లటి కవర్లలో ఉంచి రిఫ్రిజిరేటర్‌లో భద్రపర్చారు.
తొలుత ఓ ఐదంతుస్తుల భవనంలో ఉన్న 63 యేళ్ల బ్రిటిష్ వ్యక్తిని అరెస్టు చేసే క్రమంలో పోలీసుల మధ్యలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పోలీస్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల అనంతరం బ్రిటిష్ వ్యక్తితో పాటు ఇద్దరు అమెరికన్లు, ఇద్దరు బర్మావాసులను అరెస్టు చేశారు. వారి స్థావరంలో భారీగా తుపాకులు, నకిలీ పాస్ పోర్టులను, మత్తుపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.