ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతూ, లక్షలాది మంది నిరాశ్రయులవుతున్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మరోసారి స్పందించారు. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తుందని చెబుతూనే, గాజాలో మానవతా సంక్షోభాన్ని గుర్తించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు.
ఇజ్రాయెల్‌లో హమాస్ జరిపిన భయానక దాడులను ఆయన నిజంగా క్రూరమైన దాడులుగా అభివర్ణించారు. హమాస్ ముందు అల్-ఖైదా చిన్నబోయిందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్, ఈజిప్ట్, జోర్డాన్, ఇతర అరబ్ దేశాల ప్రభుత్వాలు ఐక్యరాజ్యసమితితో నేరుగా కమ్యూనికేట్ చేయడానికి తమ బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించాయి.