రష్యా ఆ ఆయుధాలను ఉపయోగించవచ్చు.. జో బైడన్

మంగళవారం, 22 మార్చి 2022 (22:55 IST)
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ బలగాల నుంచి ఊహించని విధంగా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండటంతో రసాయన, జీవ ఆయుధాలను ఉపయోగించడాన్ని పుతిన్ పరిశీలిస్తున్నట్లు బైడెన్ తెలిపారు. ఈ విషయంలో తమకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు.
 
అంతేకాదు అమెరికన్లపై రష్యా సైబర్ దాడులకు దిగే అవకాశం ఉందని.. అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని బైడన్ హెచ్చరించారు. మరోవైపు, పుతిన్‌ను యుద్ధ నేరస్తుడంటూ ఆరోపించిన బైడెన్ వ్యాఖ్యలపై రష్యా స్పందించింది. 
 
రష్యాలో అమెరికా రాయబారి జాన్ సులివాన్‌ను పిలిచి వివరణ అడిగింది. బైడెన్ ప్రకటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను విచ్ఛిన్నం చేసేలా ఉన్నాయని రష్యా తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు