సుమారు గంటకు పైగా టాయిలెట్‌పై కూర్చొని మొబైల్ ఫోన్లో గేమ్‌లు ఆడుతూ కూర్చున్న పిల్లాడు పైకి లెచేందుకు ప్రయత్నించగా, టాయిలెట్లో నుండి పైకి లేవలేకపోయాడు. దీంతో టాయిలెట్లో ఇరుక్కుపోయామనే విషయం తెలుసుకున్న పిల్లాడు గట్టిగా కేకలు పెట్టాడు.
చివరకు ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ పిల్లాడిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. మొదట చిన్న కత్తిని ఉపయోగించి కత్తితో టాయిలెట్‌పై సీట్ కట్ చేసారు. ఆ తర్వాత ఇతర వస్తువుల సాయంతో కమోడ్‌ని కట్ చేసి పిల్లాడిని బయటకు తీసారు. ఈ క్రమంలో బుడతడు చిన్న చిన్న గాయాలతో క్షేమంగా బయటపడ్డాడు. దీంతో తల్లి ఊపిరిపీల్చుకుంది.