ప్రస్తుతం అమెరికా దేశ 46వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన విషయంతెల్సిందే. దీంతో ఆయన తన పాలన వర్గాన్ని నియమించుకునే క్రమంలో తీరిక లేకుండా గడిపారు. కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలి, పాలన వర్గం ఎలా ఉండాలనే దానిపై చర్చలు జరిపారు. ట్రంప్, మైక్ పెన్స్, సెనేటర్ టెడ్ క్రుజ్ తదితరులు దాదాపు 6 గంటలపాటు చర్చల్లో తలమునకలయ్యారు.
ఈ నేపథ్యంలో, భారత సంతతికి చెందిన బాబీ జిందాల్‌ను ఆరోగ్యశాఖ మంత్రిగా, అలబామా సెనేటర్ జెఫ్ సెషన్స్‌ను డిఫెన్స్ మంత్రిగా, ట్రెజరీ విభాగానికి స్టీవెన్ నుచిన్ను నియమించాలని దాదాపు డిసైడ్ అయినట్టు సమాచారం. ఇదే జరిగితే, అమెరికా కేబినెట్‌కు ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా బాబీ జిందాల్ చరిత్ర సృష్టిస్తారు.