పాకిస్థాన్‌లో తీవ్ర చలి.. 36మంది పిల్లలు మృతి

సెల్వి

శుక్రవారం, 12 జనవరి 2024 (14:36 IST)
పాకిస్థాన్‌లో రోజురోజుకు చలి పెరుగుతోన్న పరిస్థితిలో తీవ్ర చలి కారణంగా 36 మంది పిల్లలు మరణించినట్లు తెలుస్తోంది. భారతదేశంలో రాజధాని ఢిల్లీ నుండి కాశ్మీర్ వరకు చలితో జనం వణికిపోతున్నారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో నిమోనియా ప్రభావంతో 36 మంది చిన్నారులు దయనీయంగా మృతి చెందారు. 
 
అయితే పాకిస్థాన్‌లో పిల్లలు చల్లని కాలంలో అనుసరించాల్సిన విధానాలను ప్రభుత్వం ప్రకటించింది. చల్లని కారణంగా ఈ నెల చివరి వరకు పాఠశాల ప్రాంగణాల్లో అసెంబ్లీ నిర్వహించడంపై నిషేధం విధించబడింది. నర్సరీ తరగతులకు జనవరి 19 వరకు సెలవులు ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు