అమేజాన్ చిట్టడవుల్లో 11నెలల చిన్నారితో నలుగురు పిల్లలు సురక్షితం

గురువారం, 18 మే 2023 (12:34 IST)
అమేజాన్ చిట్టడవుల్లో ఓ విమానం కూలిపోగా అందులో 11 నెలల చిన్నారితో సహా నలుగురు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. కాగా మే 1న విమానం కూలిపోగా బుధవారం చిన్నారులను గుర్తించారు. ఇది యావత్ దేశానికి సంతోషకరమైన సమయమని కొలంబియా దేశాధ్యక్షుడు గుస్తావ్ పెట్రో ట్విట్టర్ వేదికగా తెలిపారు. 
 
మే 1న ఆ విమానం అమేజాన్ అడవుల్లో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని ముగ్గురు పెద్దలు ప్రాణాలు కోల్పోయారు. కానీ విమానంలో 11నెలల వయస్సున్న చిన్నారులతో పాటు 13, 9, 4 ఏళ్ల వయస్సున్న పిల్లలు కూడా ఉన్నారు. ఆపరేషన్ హోప్ పేరిట నిర్వహించిన ఈ గాలింపు చర్యల్లో తొలుత చిన్నారులు క్షేమంగా ఉన్నారని చెప్పేందుకు పలు ఆధారాలు బయటపడ్డాయి. 
 
చిన్నారులు ఎటు వెళ్లాలో తెలీక  అడవంతా సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో గాలింపు చర్యలను మరింత విస్తృతం చేయగా బుధవారం చిన్నారుల ఆచూకీ లభించింది. వారిని సురక్షితంగా అడవి నుంచి తరలించారు. ఆర్మీ అధికారుల ప్రయత్నాలు ఫలించడంతో చిన్నారులందరూ ప్రాణాలతో బయటపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు