విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. ఈ వీడియో వీక్షించండి

ఆదివారం, 9 అక్టోబరు 2016 (14:33 IST)
చెక్ రిపబ్లిక్ దేశంలోని ఓ విమానాశ్రయంలో ఓ బోయింగ్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఈ పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు అధికంగా జరుగుతున్న విషయం తెల్సిందే. దీంతో విమాన ప్రయాణం అంటే గాల్లో దీపంలా మారింది. ఈ నేపథ్యంలో.. యూరప్‌లోని చెక్ రిపబ్లిక్‌లో ఉన్న ప్రగీ విమానాశ్రయంలో బోయింగ్ 737-430 విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. 
 
విమానాన్ని ల్యాండింగ్ సమయంలో ఒక వైపు ఒరిగి పోయి రన్‌ను ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు మంటలు చెలరేగక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత తేరుకున్న పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు.

 

వెబ్దునియా పై చదవండి