ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సింగపూర్‌లో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో.. డొనాల్డ్ ట్రంప్.. కిమ్ జాంగ్ ఉన్‌ను అమెరికాకు ఆహ్వానిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగపూర్‌లో జరుగనున్న సమావేశం సఫలమైతే.. ఆయనను అమెరికాకు ఆహ్వానిస్తామని తెలిపారు. వైట్‌హౌస్‌లో కిమ్ జాంగ్‌కు ఆతిథ్యమిస్తానని చెప్పారు.
ఇదిలా ఉంటే.. సింగపూర్ వేదికగా ఈ నెల 12న ఉదయం 9 గంటలకు డొనాల్డ్ ట్రంప్- కిమ్ జాంగ్ ఉన్ సమావేశం ఉంటుందని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ వెల్లడించారు. ఈ సమావేశానికి అమెరికా నుంచి భద్రతా బలగాలు సింగపూర్ వెళతాయని, ముందురోజు రాత్రి 9 గంటల నుంచే సమావేశం ప్రాంతం తమ అధీనంలో ఉంటుందని శాండర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.