డిసెంబర్ వరకు హెచ్1బీ, ఎల్1 వీసాలపై నిషేధం.. డొనాల్డ్ ట్రంప్

బుధవారం, 24 జూన్ 2020 (10:18 IST)
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా 23 లక్షల మందికిపైగా కరోనా వైరస్ బారినపడగా.. 1.22 లక్ష మంది మృత్యువాతపడ్డారు. దీంతో కోవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ట్రంప్ స‌ర్కార్ అనేక చ‌ర్య‌లు తీసుకుంటుంది. 
 
ఇందులో భాగంగా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇత‌ర దేశాల నుంచి త‌మ దేశానికి వ‌చ్చే వ‌ల‌స‌లదారుల‌‌పై మూడు నెలలు తాత్కాలికంగా నిషేధం విధిస్తున్న‌ట్లు ఏప్రిల్‌లోనే ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే.
 
తాజాగా, ఈ నిషేధాన్ని డిసెంబరు వరకు పొడిగిస్తూ డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కరోనా సంక్షోభంతో స్వ‌దేశంలో ఏర్పడిన నిరుద్యోగ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌డమే లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
హెచ్‌1-బీ, హెచ్-4 స‌హా అన్ని ర‌కాల టెంప‌ర‌రీ వ‌ర్క్ వీసాల‌పై నిషేధం కొనసాగుతుందని ట్రంప్ ప్ర‌త్యేక ఆదేశాలు జారీచేశారు. ట్రంప్ నిర్ణ‌యంతో హెచ్‌1-బీ వీసాలు, ఎల్ వీసాలు, హెచ్‌2-బీ సీజనల్ వర్కర్ వీసాలు, జే వీసాలతో అమెరికాలోకి వచ్చే వారికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయ్యింది.
 
వ‌ర్క్ వీసాల‌పై నిషేధం జూన్ 24 నుంచి అమల్లోకి వ‌స్తుంద‌ని, 2020 డిసెంబర్ 31 వరకు ఇది అమ‌ల్లో ఉంటుంద‌ని అధికారిక ప్ర‌క‌టన చేసింది. నాన్-ఇమ్మిగ్రంట్ వీసాలేని వారికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. అయితే, అమెరికా పౌర‌స‌త్వం ఉన్న‌వారి భార్య, పిల్లలు, అదేవిధంగా ఆహార స‌ర‌ఫ‌రా రంగంలో ఉన్నవారికి ఈ నిషేధం వ‌ర్తించ‌ద‌ని స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు