ఇది సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 25 వరకు గ్రహం చుట్టూ తిరుగుతుంది. దీనిని భూమికి సమీపంలో ఉన్న వస్తువు (NEO) అని కూడా పిలుస్తారు. మొదటి చిన్న చంద్రుడు, 1991 VG, 1991లో గుర్తించబడింది.
మినీ మూన్, దాని అనంతమైన సార్వత్రిక ప్రయాణంలో, అర్జున గ్రహశకలం బెల్ట్ నుండి తప్పించుకున్నట్లు చెప్పబడింది. ఇది దాదాపు 10 మీటర్లు (33 అడుగులు) ఉంటుందని, ఇది కంటితో కనిపించదు. కానీ ప్రత్యేక టెలిస్కోప్‌లను ఉపయోగించి మాత్రమే గుర్తించబడుతుంది.
ఫలితంగా ఇప్పుడున్న మూన్తో పాటే భూమికి రెండో మూన్ కూడా వచ్చింది. అయితే ఇది 56 రోజులు మాత్రమే ఉంటుంది. అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్‌లో ఉన్న 2024PT5 గా పిలిచే ఒక ఆస్టరాయిడ్ నేటి నుంచి నవంబర్ 25 వరకు దాదాపు 8 వారాల పాటు భూకక్ష్యలో పరిభ్రమించనుంది. ఆ తర్వాత మళ్లీ తన దిశను మార్చుకొని తిరిగి సూర్యుడి కక్ష్యలో పరిభ్రమిస్తుంది.
మినీ మూన్ ఈవెంట్స్ రెండు రకాలుగా ఉంటాయి. సుదీర్ఘ కాలం ఉండేవి, స్వల్పకాలం ఉండేవి. సుదీర్ఘ కాలం మినీ-మూన్ ఈవెంట్స్ దాదాపు ఏడాది లేదా అంతకు మించిన ఎక్కువ సమయం ఉంటాయి. స్వక్పకాలిక మినీ మూన్ ఈవెంట్స్ వారాలు లేదా కొద్ది నెలలు మాత్రమే సంభవిస్తాయి. రెండో మూన్‌ను చందమామ లాగే చూడగలమా అంటే కష్టసాధ్యం అంటున్నారు శాస్త్రవేత్తలు.