మనీలాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్టు

ఠాగూర్

సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (08:44 IST)
మనీలాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 2017 నుంచి 2024 వరకు ప్రధానిగా పనిచేసిన జగన్నాథ్ గతేడాది చివరులో రాజీనామా చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని ఒప్పందాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని, వాటిపై ఆడిట్ నిర్వహిస్తామని ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నివీన్ రామ్ గులాం ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా జగన్నాథ్ నివాసంలో ఆర్థిక నేరాల కమిషన్ శనివారం సోదాలు చేపట్టింది. ఇందులోభాగంగా, కీలక డాక్యుమెంట్లు, ఖరీదైన గడియారాలు, పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంది. ప్రవింద్ భార్య కోబితాను కూడా అధికారులు గుంటపాటు విచారించారు. అనంతరం ప్రవింద్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను సెంట్రల్‌ మారిషస్‌లోని మోకాలో ఉన్న నిర్బంధ కేంద్రంలో ఉంచారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు