రెచ్చగొడితే అణ్వాయుధాలను ఉపయోగిస్తాం.. కిమ్ హెచ్చరిక

సెల్వి

శుక్రవారం, 4 అక్టోబరు 2024 (10:39 IST)
తమను రెచ్చగొట్టబడితే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని, దక్షిణ కొరియాను శాశ్వతంగా నాశనం చేస్తానని ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. అయితే అణ్వాయుధాలను ఉపయోగించడానికి కిమ్ ప్రయత్నిస్తే కిమ్ పాలన కూలిపోతుందని దక్షిణ కొరియా నేతలు హెచ్చరిస్తున్నారు. 
 
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఇలాంటి హెచ్చరికలు మామూలే. ఇటీవల కాలంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య సంబంధాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. మే చివరి వారం నుంచి  ఉత్తర కొరియా వేల సంఖ్యలో చెత్త బెలూన్లను దక్షిణ కొరియా గగనతలంలోకి వదులుతోంది. 
 
ఈ క్రమంలో ఉత్తర కొరియాకు చెందిన యురేనియం శుద్ధీకరణ ప్లాంట్ దృశ్యాలను ఓ మీడియా సంస్థ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని కిమ్ పిలుపునిచ్చినట్లు ఆ మీడియా సంస్థ పేర్కొంది. ఉత్తర కొరియాకు చెందిన 250 బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను దక్షిణ సరిహద్దుల్లో మోహరించినట్లు ప్రకటించింది.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు