ఓవైపు కట్టుకున్న భార్య.. మరోవైపు 22 ఏళ్ల యువతి. అంతే ఆ మృగాడు భార్య పక్కనున్న సంగతి మరిచిపోయాడు. అంతే నిద్రలోకి జారుకున్న యువతిపై కన్నేశాడు. డ్రెస్ బటన్‌ను తీశాడు. ప్రైవేట్ పార్ట్స్‌పై చెయ్యేశాడు. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదంతా విమానంలో ప్రయాణిస్తున్న వేళ జరిగింది. ఈ ఘటన డెట్రాయిట్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన రమణమూర్తి అమెరికాలోని రోచెస్టర్ హిల్స్ సిటీలో ఉంటూ ఓ ఐటీ సంస్థలో మేనేజరుగా పనిచేసేవాడు. ఏడు నెలల క్రితం తన భార్యతో కలిసి లాస్‌వేగాస్‌లో డెట్రాయిట్ వెళ్లే స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కాడు. తనకు ఓవైపు భార్య, మరోవైపు 22 ఏళ్ల యువతి కూర్చున్నారు. కాసేపటికి నిద్రలో జారుకున్న యువతిపై రమణమూర్తి లైంగిక చర్యలకు ఉపక్రమించాడు.
ఆ సమయంలో తాను గాఢంగా నిద్రపోతున్నాననీ, తనకేం తెలియదంటూ రమణమూర్తి మొదట దబాయించాడు. లోతుగా ప్రశ్నించేసరికి... చేయకూడనిది చేసి ఉంటానని నేరం అంగీకరించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మిచిగాన్‌లోని డెట్రాయిట్ న్యాయస్థానం ఇటీవల అతడిని దోషిగా తేల్చింది.