వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి లండన్ కోర్టు షాకిచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి దాదాపు రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే కేసుపై రెండేళ్లుగా కొనసాగుతున్న విచారణలో లండన్ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. నీరవ్‌పై మనీలాండరింగ్ అభియోగాలు రుజువయ్యాయని కోర్టు పేర్కొంది.
ఇందులో భాగంగా నీరవ్‌ను విచారించేందుకు భారత్‌కు అప్పగించాలని తీర్పు చెప్పింది. భారత్‌కు అప్పగిస్తే తనకు న్యాయం జరగదని, ఆరోగ్య స్థితి సరిగ్గా లేదనే సాకులతో నీరవ్ చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. భారత్‌కు అప్పగిస్తే అన్యాయం జరుగుతుందనే వాదనకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. భారత్‌కు అప్పగించినా ఆయనకు అన్యాయం జరగదని కోర్టు స్పష్టం చేసింది.