దీంతో ఆక్సిజన్‌ను గ్రహించే శక్తిని ఊపిరితిత్తులు కోల్పోతాయని ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. దీంతో రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయి, మృతి చెందే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. పేద దేశాల్లో ఆక్సిజన్ కొరత ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
ఆయా దేశాల్లో ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి సమయం మరికొన్ని రోజులే ఉందని, కరోనా విజృంభణ పెరిగిపోతే పరిస్థితులు చేజారి పోతాయని తెలిపారు. అధిక ఆదాయం ఉన్న దేశాల్లో ఆక్సిజన్ కొరత అంతగా లేకపోయినప్పటికీ పేద దేశాల్లో తీవ్రంగా ఉందన్నారు.