పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. కర్బూజ కాయలను దొంగిలించారని బాషారత్ (9), ఇర్ఫాన్ (13) అనే ఇద్దరు చిన్నారులను నానా హింసలు పెట్టి వీధుల్లో బట్టలు లేకుండా నగ్నంగా ఊరేగించారు. అంతటితో ఆగకుండా చిన్నారులను దుర్భాషలాడుతూ చిత్రహింసలకు కూడా గురి చేశారు. ఈ తతంగాన్నంతా వీడియో కూడా తీశారు. ఈ వీడియోనే ఆ దుకాణం యజమానుల మెడకు చుట్టుకుంది.