రైళ్లు, బస్సుల్లో, ఆటోల్లో లగేజీని మరిచిపోతూ వుంటారు చాలామంది. అయితే ఇక్కడ ఓ మహాతల్లి కన్నబిడ్డనే మరిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. లండన్‌లోని పెక్కాహ్యామ్ రైల్వే స్టేషన్‌లో ఓ తల్లి ప్రయాణిస్తుంది. తోడుగా పసిబిడ్డ కూడా ఉంది. అయితే స్టేషన్ రాగానే హడావుడిగా రైలు దిగేసింది తల్లి. కొంచెం దూరం నడవగానే చూసుకుంటే పసిబిడ్డ లేదనే విషయం గుర్తొచ్చింది.
అప్పటికే రైలు కదలడంతో లబోదిబోమని గుండెలు బాధకుంటూ స్టేషన్ సిబ్బందికి విషయం చెప్పి ప్రాధేయపడింది. వారు ముందు స్టేషన్లో రైలును కాసేపు ఆపి ఆమెను మరొక రైల్లో ముందు స్టేషన్‌కు, తరలించి తల్లిబిడ్డను కలిపారు.