అమెరికా 45వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారంచేశారు. ఆ తర్వాత అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మూడు చోట్ల ఫ్రీడమ్ వాల్ డాన్స్‌లో పాల్గొని, ప్రసంగించారు. అమెరికా ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని పునరుద్ఘాటించారు. ట్విట్టర్‌లో తన సందేశాలు చూడొచ్చని జనాలకు ఆయన తెలియజేశారు.
అంతేనా అధ్యక్షుడయ్యాక సతీమణి మెలానియా ట్రంప్ అమెరికా మిలిటరీ అధికారులతో కలిసి నృత్యం చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రంప్, మెలానియా సంప్రదాయం ప్రకారం మిలిటరీ అధికారులతో కలిసి డ్యాన్స్ చేసి కేక్ కట్ చేశారు. ట్రంప్, మెలానియాలతో పాటు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఆయన సతీమణి కరేనా కూడా డ్యాన్స్ చేశారు.
యూఎస్ నేవీకి చెందిన అధికారిణి కాథరీన్ కార్ట్‌మెల్‌తో ట్రంప్, యూఎస్ ఆర్మీకి చెందిన అధికారి జోస్ ఏ మెడీనా అనే అధికారితో మెలానియా నృత్యం చేశారు. సైనికుల త్యాగాలు, వారి సేవల గౌరవార్థం ఏర్పాటు చేసే సంప్రదాయ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయుధ దళాలలకు మెలానియా ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. వారికి ప్రథమ మహిళగా ఉండడం గౌరవంగా భావిస్తున్నానన్నారు.
అయితే, మనకి తెలియని డోనాల్డ్ ట్రంప్ ఎలా ఉంటాడో కూడా ఈ సందర్భంగా తెలుసుకోవాల్సింది. ఆయన ఓ కరుడు గట్టిన వ్యాపార వేత్త.. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని వ్యక్తి.. నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతాడు.. ముఖ్యంగా చెప్పాలంటే నిలకడ లేని వ్యక్తి.. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుకుంటున్నారు. కానీ ట్రంప్‌లో ఓ గొప్ప మానవతావాది ఉన్న విషయం మనకి తెలియదు.