ఇక మోదీ రాక కోసం ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారిగా చెప్తున్నారు. ఈజిప్ట్ చేరుకున్న తర్వాత ప్రధాని మోడీ అక్కడి నాయకులు, ప్రవాస భారతీయులతో వరుసగా భేటీ కానున్నారు. దాదాపు అరగంటపాటు అల్-హకీమ్ మసీదులో గడపనున్నారు.
తన ఈజిప్ట్ పర్యటన సందర్భంగా, ప్రధాని మోడీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్ కోసం అత్యున్నత త్యాగం చేసిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించేందుకు హెలియోపోలిస్ వార్ గ్రేవ్ స్మశానవాటికను కూడా సందర్శించనున్నారు.