ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్యాయత్నం నుంచి బయటపడినట్లు ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కైరిలో బుడనోవ్ తెలిపారు. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, అలాగే పుతిన్ ఆరోగ్యంపై వివిధ రకాలైన పుకార్లు వచ్చిన విషయం తెల్సిందే.
అయితే, పుతిన్‌పై దాడి విఫలమైందని కాకసస్ అధికారులు తెలిపారు. బుడనోవ్ ప్రకారం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన కొద్దిసేపటికే పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందని వెల్లడించారు. అయితే ఈ దాడికి ఉక్రెయిన్‌కు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.