రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

ఠాగూర్

మంగళవారం, 29 జులై 2025 (10:11 IST)
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "కూలీ". ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్‌డేట్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులోభాగంగా వచ్చే నెల నాలుగో తేదీన ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. ఆగస్టు 14వ తేదీన విడుదలకానున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతిహాసన్‌ తదితరులు కీలక పాత్రలను పోషించారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేశారు. ఇటీవల లోకేశ్ కనకరాజ్ మాట్లాడుతూ, ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ వేడుక ఏమీ ఉండదని, నేరుగా చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. 
 
అయితే, ఉన్నట్టుండి 'కూలీ' ట్రైలర్‌ను ఆకస్మికంగా విడుదల చేస్తామని ప్రకటించారు. ఆగస్టు 2వ తేదీన ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. బడా నిర్మాత కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లోకేశ్ యూనివర్స్ వరల్డ్ సిరీస్‌లో వస్తున్న చిత్రం కావడంతో టీజర్ ఇప్పటికే భారీ అంచనాలను పెంచేసింది. రజనీకాంత్ లుక్స్, పోస్టర్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు