ఉక్రెయిన్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న రష్యా నగరం బెల్‌గోరోడ్‌లో ఆదివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు మొత్తం 11 అపార్ట్‌మెంట్ భవనాలు, 39 నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. ఈ దాడిని ఆ ప్రాంత గవర్నర్ గ్లాడికోవ్ ధ్రువీకరించారు.
ఈ పేలుళ్ల కారణంగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిపై ఉక్రెయిన్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత నుంచి తరచూ ఈ విధంగా రష్యాలో ఏదో ఒక ప్రాంతంలో పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కీలకమైన మౌలిక వ్యవస్థలున్న ప్రదేశాల్లో ఇవి చోటుచేసుకోవడం గమనార్హం.
ముఖ్యంగా ఉక్రెయిన్ దాడికి వినియోగిస్తోన్న ఆయుధాలు, నిర్మాణాలను గుర్తించి ధ్వంసం చేయడం ఈ బెటాలియన్ పని. ఇప్పటి వరకు ఈ దళాలు రష్యా చమురు , ఆయుధ డిపోలు, కమ్యూనికేషన్ పరికరాలు వంటి వాటిని లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించాయి.