ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన మార్స్ ఎక్స్‌ప్రెస్ ఆర్బిటార్‌లోని రాడార్ సమాచారాన్ని బట్టి అంగారకునిపై నీరున్న సంగతిని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. మార్సిస్‌గా పిలుస్తున్న ఈ రాడార్.. భూమిపై గ్రీన్‌లాండ్, అంటార్కిటికాల్లోని మంచు ఫలకాల కింద నీరును తెలియచేసే తరహా సంకేతాలును పంపింది. దీనిని బట్టి ఇక్కడ సరస్సు వుండేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. గడ్డకట్టిన ఉపరితలానికి 1.5 కి.మీ దిగువన ఇది వుందని శాస్త్రవేత్త రాబర్టో ఒరోసెయ్ తెలిపారు. ఈ నీరు ఉప్పునీరుగా గుర్తించామన్నారు.