గట్టిగా చదివితే .. జ్ఞాపకశక్తి పెరుగుతుంది...

ఆదివారం, 3 డిశెంబరు 2017 (10:22 IST)
పూర్వం వేదం నేర్చుకునే వేదపండితులు.. గట్టిగా చదివేవాళ్లు. కంఠస్థం చేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడేది. అక్షరాల స్పష్టత కోసం.. జ్ఞాపకం పెట్టుకోవడం కోసం ఇలా చదువుతుండే వాళ్లు. బిగ్గరగా చదువుతుంటే.. కొంతమంది చిరాకుపడుతుంటారు. కానీ ఇప్పుడదే విధానం… బెస్ట్ అంటున్నారు ఆధునికి పరిశోధకులు. 
 
గట్టిగా చదివితే జ్ఞాపకశక్తి అమోఘం అంటున్నారు. లోలోపల చదివే కంటే బయటికి చదివితే సబ్టెక్టు ఎక్కువ రోజులు మెదడులో నిక్షిప్తమై ఉంటుందని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్లూ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. మనకు మనమే బిగ్గరగా మాట్లాడటం, వినడం వల్ల మెదడుపై ప్రయోజనకర ప్రభావం పడుతుందని, దాంతో చురుగ్గా తయారవుతామంటున్నారు. 
 
రాయడం, తనకు తానే లోలోపల చదువుకోవడం, వేరేవాళ్లు చదువుతుంటే వినడం, బిగ్గరగా చదవడం.. ఇలా నాలుగు విధాలుగా విద్యార్థులను పరీక్షించగా గట్టిగా చదివిన వారిలో చదివిన సబ్టెక్టు బాగా గుర్తున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని వివరించారు. ఈ విషయాన్ని భారతీయ పూర్వీకులు వేదకాలంలోనే నిరూపించారు. ఇపుడు కెనడా పరిశోధకులు శాస్త్రీయంగా నిరూపించారన్నమాట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు