ఆమె పుతిన్‌ కూతురు కాదు అధ్యక్షా!

బుధవారం, 12 ఆగస్టు 2020 (10:08 IST)
'అదిగో పులి అంటే ఇదిగో తోక' అనడం ప్రచారబాబులకు అలవాటే. ఇప్పుడు కొత్తగా మరో అంశంలోనూ పప్పులో కాలేశారు చాలామంది. ఇంతకీ విషయమేంటంటారా?.. 

కరోనాకు మొట్టమొదటిసారి రష్యా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను తయారుచేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ మంగళవారం ప్రకటించారు.

తన కుమార్తె కూడా ఈ వ్యాక్సిన్‌ తీసుకున్నట్టు వెల్లడించారు. దాంతో ఇదిగో ఈ యువతే పుతిన్‌ కూతురు అంటూ సోషల్‌మీడియాలో ఒక అమ్మాయి వ్యాక్సిన్‌ తీసుకుంటున్న వీడియో వైరల్‌ అయ్యింది. ఎంతో మంది ఈ వీడియోను షేర్‌ చేశారు. 
 
నిజానికి ఈ వీడియోలో ఉన్న యువతి కరోనా వ్యాక్సిన్‌ వలంటీరే.. కానీ పుతిన్‌ కూతురు కాదు. జూలైలో ఓ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న ఆ యువతి వీడియో బయటకొచ్చింది. మంగళవారం పుతిన్‌ తన కుమార్తె గురించి ప్రస్తావించటంతో ఈ వీడియోలో ఉన్నది పుతిన్‌ కూతురేనని కొందరు ప్రచారం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు