ఎవడో ఒకడికి నా కన్యత్వాన్ని అప్పగించాల్సిందే... అందుకే రూ.17 కోట్లకు అమ్ముకున్నా...

శనివారం, 8 ఏప్రియల్ 2017 (16:29 IST)
పాశ్చాత్య దేశాల్లో ఇలాంటివి మనం అప్పుడప్పుడూ వింటుంటాం. రొమానియాకు చెందిన అలెగ్జాండ్రా కెఫ్రెన్ తన కన్యత్వాన్ని వేలానికి పెడుతున్నట్లు ప్రకటించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆమె అలా ప్రకటించడంపై చాలామంది తీవ్రంగా తప్పుబట్టారు. ఇలా కన్యత్వాన్ని వేలం వేయడమేమిటంటూ ముక్కున వేలేసుకున్నారు. కానీ ఆమె కన్యత్వం ద్వారా రూ. 17 కోట్లు ఆర్జించింది.
 
జర్మనీ దేశానికి చెందిన ఓ ఎస్కార్ట్ సంస్థ ద్వారా తన కన్యత్వాన్ని వేలం వేయగా 17 కోట్లకు హాంగ్ కాంగ్ కు చెందిన బడా పారిశ్రామికవేత్త పాడుకున్నారు. ఈ సందర్భంగా అలెగ్జాండ్రా మాట్లాడుతూ... భవిష్యత్తులో ఎవరో ఒకరికి తన కన్యత్వాన్ని అప్పగించాల్సిందేననీ, అలాంటప్పుడు దాని ద్వారా సొమ్ము చేసుకుని తన కాళ్లపై తను నిలబడాలనే ఈ పనికి పూనుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇందులో తను ఏమాత్రం సిగ్గుపడటం లేదంటోంది. మరో విషయం ఏంటంటే... కన్యత్వానికి వేలం పెట్టేంత దయనీయ స్థితిలో ఆమె లేదంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈమె అలాంటి పని చేయాల్సిన అవసరం ఏంటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి