డిటెక్టర్ అనే పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కానీ రూస్ పట్టణంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మారనోవాకు అదే చివరి రోజుగా మారిపోయింది. మారనోవాను అడ్డుకున్న దుండగులు ఆమెను పాశవికంగా హత్య చేశారు. చిత్ర హింసలకు గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై హతమార్చారు.
అయితే పోస్ట్‌మార్టం నివేదికలో మాత్రం మారినోవా తలకు భారీ గాయాలయ్యాయని... ఊపిరాడక ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు. గతేడాది కాలంలో యూరప్ దేశాల్లో జర్నలిస్టులు హత్యకు గురికావడం ఇది మూడోసారి ఈ నేపథ్యంలో మారనోవా హత్యకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ పోలీసులు మారనోవా హత్య నిందితుల కోసం గాలిస్తున్నారు.