చైనా కొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా తొమ్మిది గంటల్లోనే ఏకంగా రైల్వేస్టేషన్‌ను నిర్మించి రికార్డు నెలకొల్పింది. తద్వారా నిర్మాణ రంగంలో చైనాకు తిరుగులేదని నిరూపించింది. జనవరి 19న మొత్తం 1500 రైల్వే సిబ్బందితో లాంగ్యాన్ పట్టణంలో నాన్‌లాంగ్ రైల్వే స్టేషన్‌ను నిర్మించింది. పట్టాల ఏర్పాటు నుంచి సిగ్నలింగ్ వ్యవస్థ వరకు అన్నింటిని జాగ్రత్తగా ఏర్పాటు చేశారు. కేవలం తొమ్మిది గంటల్లోనే మొత్తం పనులను పూర్తి చేశారు.
చైనాలోని మూడు ప్రధాన రైల్వే లైన్లు అయిన గాంగ్‌లాంగ్ రైల్వే, గాన్‌రుయిలింగ్ రైల్వే, ఝాంగ్‌లాంగ్ రైల్వేలను అనుసంధానం చేసేందుకుగాను ఈ స్టేషన్‌ను నిర్మించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైస్పీడ్ రైల్వే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చైనా 247 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం రూ.7లక్షల కోట్లు వెచ్చించారని.. తాజాగా నిర్మించిన రైల్వే స్టేషన్ కూడా అందులో భాగమేనని అధికారులు స్పష్టం చేశారు.