చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఓ శుభవార్త. ఆ జట్టు సభ్యుల్లో యువ క్రికెటర్ దీపక్ చాహర్ కరోనా వైరస్ బారినపడ్డాడు. దీంతో అతన్ని సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంచారు. ఈ క్రమంలో ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చింది. దీంతో దీపక్ త్వరలోనే జట్టు సభ్యులతో కలుస్తాడని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తమ జట్టు సభ్యుడు దీపక్ చాహర్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలిందని, అందువల్ల త్వరలోనే జట్టుతో కలిసి మైదానంలో ప్రాక్టీస్ చేస్తాడని తెలిపారు.
సీఎస్‌కే, బీసీసీఐ వైపు నుంచి దీపక్‌కు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయని, శుక్రవారం నుంచి శిక్షణ ప్రారంభిస్తాడని ఆయన చెప్పారు. మరో విదేశీ ప్లేయర్ డేవిడ్ మలన్(ఇంగ్లాండ్)ను జట్టులోకి తీసుకోవాలని సీఎస్‌కే యోచిస్తున్నదా? అనే ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.