వచ్చే నెలలో ఐపీఎల్ క్రికెట్ సందడి ప్రారంభంకానుంది. యూఏఈ వేదికగా ఈ టోర్నీ ప్రారంభంకానుంది. ఇందుకోసం ఐపీఎల్ జట్లు ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్నాయి. అయితే, ఈ ఐపీఎల 2020ని పురస్కరించుకుని రిలయన్స్ జియో రెండు సరికొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది.
కాగా, రూ.499 క్రికెట్ ప్లాన్ ప్రకారం ఐపీఎల్ సీజన్ మొత్తం రోజుకు 1.5 హై స్పీడ్ డేటాతో 56 రోజులు పాటు అందిస్తుంది. వీటితో పాటు.. డిస్నీ, హాట్‌స్టార్ వీఐపీ చందా ఏడాది ఉచితం. అయితే, ఈ ప్లాన్ కింద ఎలాంటి ఫోన్ కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉండదు.
ఇకపోతే రూ.777 క్రికెట్ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్ కింద, 5 జీబీ అదనపు డేటాతో 1.5 జీబీ రోజువారీ హైస్పీడ్ డేటా, అపరిమిత జియో టూ జియో కాలింగ్, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి 3,000 ఎఫ్‌యుపి నిమిషాలు రోజుకు 100 కాంప్లిమెంటరీ ఎస్ఎంఎస్లు పంపించుకునే వెసులుబాటు ఉంది.