ముంబై జట్టు కోసం అర్జున్ టెండూల్కర్... క్లీన్ బోల్డ్ చేశాడుగా! (Video)

గురువారం, 21 ఏప్రియల్ 2022 (19:38 IST)
ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై జట్టుకు అర్జున్ టెండూల్కర్ ఆడే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ముంబై జట్టులో టెండూల్కర్ పేరున్నవాళ్లు ఉంటే ఆ జట్టుకు కలిసి వస్తుందేమో అన్న అభిప్రాయాల్ని ఇటీవల మాజీ క్రికెటర్ అజారుద్దీన్ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను జట్టు నిజం చేసేలా వుంది. 
 
మరోవైపు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడైన అర్జున్‌.. ఓ ఆల్‌రౌండర్‌గా రూపుదిద్దుకుంటున్నాడు. 
 
ఎడమ చేతి స్పీడ్ బౌలర్ అయిన అర్జున్‌.. నెట్స్‌లో ఓ ప్లేయర్‌ను తన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దానికి సంబంధించిన వీడియోను ముంబై టీమ్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
నిజానికి లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ అరంగేట్రం చేస్తాడని భావించారు. ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు సోదరి సారా టెండ్కూలర్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు