స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 15వ సీజన్ పోటీల్లోభాగంగా సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. నరాలు తెగే ఉత్కంఠత మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధిచింది. తొలుత బ్యాట్స్‌మెన్ బట్లర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ చేయగా, ఆ తర్వాత చాహల్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. దీంతో కోల్‌కతా జట్టులో శాంసిన్, ఆరోన్ ఫించ్ చేసిన పోరాటం వృధాగా మిగిలిపోయింది. పైగా, ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును చాహల్ అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఈ సీజన్‌లో అత్యధికంగా 217 పరుగుల స్కోరు చేసింది. బట్లర్ ఈ సీజన్‌లో రెండో సెంచరీ బాదాడు. ఐపీఎల్‌లో అతడికి ఇది మూడో సెంచరీ. మొత్తంగా 61 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. అలాగే, పడిక్కల్ 24, సంజూ శాంసన్ 38, హెట్మెయిర్ 26 చొప్పున పరుగులు చేశారు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఆ తర్వాత 2018 పరుగుల కొండంత విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా జట్టు 19.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఫించ్ 58, హెట్మయిర్ 0, శ్రేయాస్ అయ్యర్ 85, రాణా 18, రస్సెల్ 0, వెంకటేష్ 6, షెల్డన్ 8, మావి 0, కమ్మిన్స్ 0, ఉమేష్ 21, వరుణ్ 1, ఎక్స్‌ట్రాల రూపంలో 13 చొప్పున పరుగులు వచ్చాయి. రాజస్థాన్ బౌలర్లలో చాపల్ హ్యాట్రిక్‌తో ఏకంగా ఐదు వికెట్లు తీయగా, మెకాయ్ 2, ప్రసిద్ధ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.