ముస్లిం మతస్థులకు అత్యంత ముఖ్యమైనది రంజాన్ పండుగ. ఈ పండుగ సందర్భంగా ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ముస్లింలు నెలపాటు నియమాలతో కూడిన కఠినమైన ఉపవాస దీక్షలు చేపడతారు. ఈ నెలలో వారు అధికంగా దానధర్మాలు చేస్తారు.
రంజాన్ మాసంలో చేసే దానాలకు అధిక ప్రాముఖ్యత ఉంది. ఈ దానాల్లో రెండు రకాలున్నాయి. జకాత్, ఫిత్రా. జకాత్ అంటే ముస్లిం మతస్థులు తమ సాంవత్సరిక ఆదాయం, ధనంలో 2.5 శాతం డబ్బు అవసరమున్న, పేదవారికి సాయం చేయాలి. ఈ జకాత్‌ను రంజాన్ నెలలో లెక్కగట్టి చెల్లిస్తారు.
ఫిత్రా దానధర్మాలు
ఫిత్రా ధార్మిక విధానం కింద అభాగ్యులకు, పేదవారికి దానం చేస్తారు. తిండి, బట్టలకు నోచుకోని వారికి వీరు సాయం చేస్తారు. దేవుడు తమకిచ్చిన జీవితం, సుఖసంతోషాలకు కృతజ్ఞతగా ముస్లిం సోదరులు లేనివారికి ఈ దానం చేస్తారు.
రెండోది ఫిత్రా. ఫిత్రా ధార్మిక విధానం కింద అభాగ్యులకు, పేదవారికి దానం చేస్తారు. తిండి, బట్టలకు నోచుకోని వారికి వీరు సాయం చేస్తారు. దేవుడు తమకిచ్చిన జీవితం, సుఖసంతోషాలకు కృతజ్ఞతగా ముస్లిం సోదరులు లేనివారికి ఈ దానం చేస్తారు. ఈ ఫిత్రాదానంలో గోధుమలు కానీ, ఆహారధాన్యములు కానీ, ధనాన్ని కానీ పంచిపెడతారు. ఈ దానం కుటుంబ సభ్యుల తరఫున ఇంటిపెద్ద చేస్తారు.
ఈ దానాల ద్వారా బంధాల నుంచి విముక్తి చెంది అల్లాను చేరుకుంటామని ఇస్లాం మతస్థుల విశ్వాసం. జీవితంలో చేసిన చెడు తలంపులు, పలికిన అసత్యాలు, చేసిన పాపాలు రంజాన్ నెల దానధర్మాల ద్వారా నశించిపోతాయని వారు చెబుతుంటారు.