వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు గూగుల్ షాకింగ్ న్యూస్.. ఏంటది?

బుధవారం, 11 ఆగస్టు 2021 (10:01 IST)
వర్క్ ఫ్రమ్ ఉద్యోగులకు గూగుల్ సంస్థ షాకింగ్ న్యూస్ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయడానికి గూగుల్ ఉద్యోగులు మారితే.. వారి వేతనంలో 25 శాతం కోత విధించాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పుడు ఈ విషయంపై సిలికాన్ వ్యాలీలో విపరీతంగా చర్చ జరుగుతోంది.
 
శాలరీ కాలిక్యులేటర్ ఆధారంగా ఉద్యోగుల పే కట్ నిర్ణయించబడుతుందని గూగుల్ పేర్కొంది. కంపెనీ ఉన్న నగరంలోనే పని చేస్తోన్న ఉద్యోగులు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం ఎంచుకుంటే వేతనాల్లో ఎలాంటి కోత ఉండదని గూగుల్ తెలిపింది. 
 
వేతనం అనేది నగరం నుంచి నగరానికి.. అలాగే రాష్ట్రానికి భిన్నంగా ఉంటుంది. అందుకే పట్టణాలు, ప్రాంతాలు ఆధారంగా ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయడానికి మారితే గూగుల్ సంస్థ వేతనాల్లో 25 శాతం వరకు కోత విధించనున్నట్లు తెలుస్తోంది. సంస్థ ఉద్యోగుల లొకేషన్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే అవకాశం ఉంది.
 
కాగా, గూగుల్ కంపెనీ వర్క్ లొకేషన్ టూల్ జూన్ నెలలో ప్రారంభమైంది. అటు ఫేస్ బుక్, ట్విట్టర్ సంస్థలు కూడా తక్కువ ఖరీదైన ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు