భారతీయ యాప్‌లకు షాకిస్తున్న గూగుల్.. మొన్న మిత్రాన్.. నేడు..?
బుధవారం, 3 జూన్ 2020 (18:47 IST)
Remove China Apps
భారతదేశంలోని గూగుల్ ప్లే స్టోర్‌లో రిమూవ్ చైనా యాప్స్ అనే ఉచిత మొబైల్ యాప్ టాప్ ట్రెండింగ్‌గా మారింది. గడిచిన నెలరోజులుగా సరిహద్దులో చైనా-భారత్‌ల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో ఈ యాప్ ప్రజాదరణ భారత్‌లో విపరీతంగా పెరిగిపోయింది.
యాప్ స్టోర్ విధానాల ఉల్లంఘన కారణంగా ఈ యాప్‌ను తొలగించబడిందని గూగుల్ ప్రతినిధి రాయిటర్స్‌కు ధృవీకరించారు. ఈ నెల చివరి వారం నుంచి ఇప్పటి వరకు భారత్ లో రిమూవ్ చైనా యాప్స్ యాప్‌ను ఐదు మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.
స్వదేశీ యాప్స్‌గా చెప్పుకుంటున్న వాటికి గూగుల్ వరుసగా షాక్‌లు ఇస్తూనే ఉంది. ఇప్పటికే టిక్ టాక్‌కు పోటీగా వచ్చిన మిత్రాన్‌ను తొలగించిన సంగతి తెలిసిందే.
మిత్రాన్ 5 మిలియన్ల డౌన్‌లోడ్లతో విశేషాదరణ పొందింది. ఫలితంగా టిక్‌టాక్ రేటింగ్స్ పడిపోయాయి. కానీ అంతలోనే గూగుల్ టిక్‌టాక్‌కు పాత రేటింగ్‌నే కేటాయించిన గూగుల్ ప్రస్తుతం మరో భారతీయ యాప్‌ను తొలగించింది.