భారత టెలికాం రంగంలో అడుగుపెట్టిన జియో వేగానికి ఇతర టెలికాం సంస్థలన్నీ డీలా పడిపోయాయి. ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో.. ఆపై చౌక ధరకే డేటా అందించడం ద్వారా ఇతర టెలికాం సంస్థల ఆదాయాన్ని దెబ్బతీసింది. ఇందులో ఎయిర్ టెల్, వొడాఫోన్ లాంటి సంస్థలున్నాయి.
జియో బ్రౌజర్ అనే ఈ ప్రత్యేక యాప్ ద్వారా సులభంగానూ, వేగంగానూ బ్రౌజింగ్ చేసుకునే వీలుంటుంది. జియో బ్రౌజర్ కనీసం 4.8ఎంబీ మాత్రమే. ఇంకా తమిళం, హిందీ, గుజరాతీ, మరాఠీ, తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ వంటి ఎనిమిది భాషల్లో జియో బ్రౌజర్‌ను ఉపయోగించుకోవచ్చునని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.