NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

దేవీ

గురువారం, 10 ఏప్రియల్ 2025 (17:26 IST)
Kalyan Ram, Vijayashanti, Sai Manjrekar
అర్జున్ S/O వైజయంతి చిత్రంలో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నానని లేడి సూపర్ స్టార్ విజయశాంతి అన్నారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్' అర్జున్ S/O వైజయంతి సెకండ్ సింగిల్- ముచ్చటగా బంధాలే సాంగ్ గ్రాండ్ గా లాంచ్ అయింది.

అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. తల్లీ కొడుకుల అనుబంధం సినిమా ప్రధానాంశం. చిత్తూరులో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో  సినిమా సెకండ్ సింగిల్- ముచ్చటగా బంధాలే  సాంగ్ ని లాంచ్ చేశారు. స్టార్ కంపోజర్ బి అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచారు.
 
రఘు రామ్ సాహిత్యంతో ఈ పాట కళ్యాణ్ రామ్ ప్రేమ వైపు ఒక గ్లింప్స్ అందిస్తుంది.  సాయి మంజ్రేకర్‌తో అతని సున్నితమైన రిలేషన్ ని పాటకు అదనపు ఎమోషన్ ని జోడిస్తుంది. ఈ చిత్రానికి సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ప్రముఖ పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ రామ్ ప్రసాద్, ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్ విస్సా. ఇప్పటికే హ్యుజ్ సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది.
 
విజయశాంతి మాట్లాడుతూ, ఎన్టీ రామారావు గారి మనవడు. ఆ క్రమశిక్షణ ఎక్కడికి పోతుంది. ఈ సినిమాని చాలా అద్భుతంగా చేశాడు. 18వ తారీఖున మీరంతా చూస్తారు. మీరంతా మెచ్చుకుంటారు. అంత అద్భుతంగా చేసాడు. ఈ కాలేజీలో ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన స్టూడెంట్స్ అందరికీ థాంక్యూ. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. నిజాయితీ పని చేసాం. ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేయవలసిందిగా మీ అందరిని కోరుకుంటున్నాను. థాంక్యూ'అన్నారు
 
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, అమ్మ ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అమ్మ నేర్పిందే. అలాంటి అమ్మలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసిన సరిపోదు. అదే అర్జున్ సన్నాఫ్ వైజయంతి. చాలా నిజాయితీగా చేసిన సినిమా ఇది. కాలేజ్ లైఫ్ బెస్ట్ లైఫ్. ఇక్కడ ఎంజాయ్ చేయండి. భాద్యతగా ఉండండి. నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకున్నదే రేపు మనకి లైఫ్ ఇస్తుంది.

12వ తేదీన మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. ఆ ఈవెంట్ కి తమ్ముడు వస్తాడు. ఆరోజు మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఈ ఈవెంట్ అద్భుతంగా జరగడానికి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అందరికీ పేరుపేరు ధన్యవాదాలు'అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు