జనసేన పార్టీ అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య రెండు మిలియన్లకు చేరింది. దీంతో పవన్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో "జై హింద్" అంటూ పేర్కొన్నాడు.
జనసేన పార్టీతో రాజకీయ నాయకుడిగా మారిన పవన్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు సమాజంలో ఉన్న సమస్యలని తన వంతు బాధ్యతగా పరిష్కరించుకుంటూ వెళుతున్నారు. రీసెంట్గా వ్యవసాయ విద్యార్థుల సమస్యలను, వారికి జరుగుతున్న అన్యాయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్న పవన్ వెంటనే వారికి న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే, ఉద్దానం సమస్యని కూడా చాలా సీరియస్‌గా తీసుకొని దాని పరిష్కారం కోసం పలువురితో దఫాలుగా చర్చలు జరుపుతూ వస్తున్నారు. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పవన్ ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. 2014 ఆగస్టులో తన ట్విటర్ ఖాతాను ప్రారంభించిన పవన్ చివరిగా బెంగుళూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ దారుణ హత్య ఘటనపై చివరిగా స్పందించారు. అయితే ఈ రోజుతో పవన్ ఫాలోవర్స్ సంఖ్య రెండు మిలియన్స్‌కి చేరింది.