కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీకి మంచి క్రేజ్ వచ్చింది. లాక్‌డౌన్‌తో చాలామంది ఇంటికే పరిమితమవ్వడం, విద్యార్థులకు సూళ్లు, కాలేజీలు మూతబడటంతో ఎంటర్టైన్మెంట్ కోసం ఆన్లైన్ గేమ్స్‌ను ఆశ్రయించే వారి సంఖ్య పెరిగింది.
2020 ఏడాదిలో మొత్తం గేమింగ్ మార్కెట్లో కేవలం మొబైల్ గేమ్స్ దాదాపు 50శాతం ఆదాయాన్ని సాధించింది. ఇక పిసి, కన్సోల్ గేమ్స్ 25% ఆదాయాన్ని సాధించాయి. ఈ లెక్కలే మొబైల్ గేమ్స్‌కు ఉన్న క్రేజ్ ఏంటో తెలియజేస్తున్నాయి.
ఈ క్రమంలోనే పబ్జీ, ఫ్రీఫైర్ వంటి గేమ్స్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. 2020లో అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన టాప్ 10 మొబైల్ గేమ్స్‌లో డౌన్లోడ్ చేయబడ్డ మొబైల్ గేమ్‌గా ఎమాంగ్ ఎస్ నిలిచింది. ఈ జాబితాలో పబ్జి మొబైల్ గేమ్ 2020లో ప్రపంచవ్యాప్తంగా 175 మిలియన్ల డౌన్లోడ్లను సాధించింది.
2019తో పోలిస్తే దీని డౌన్లోడ్స్ కొంతమేర పడిపోయినప్పటికీ, దీని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 2020లో భారత ప్రభుత్వం చైనా యాప్స్‌ను బ్యాన్ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పబ్జీ మొబైల్ యాప్‌ను కూడా బ్యాన్ చేసింది. దీంతో దీని డౌన్లోడ్స్ పడిపోయాయి.